కర్ణాటకలో కలకలం రేపుతున్న కరోనా వైరస్ : భయాందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు

తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కరోనా వైరస్‌ సోకిన వార్త కర్ణాటకలో కలకలం రేపింది. ఆ యువకుడు మూడు రోజుల పాటు బెంగళూరులో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితుడు సంచరించిన ప్రాంతాల్లో పరీక్షలకు ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. గత నెల 19 నుంచి 22 వరకు బెంగళూరులోనే ఉన్న ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పని చేసిన ఐటీ కంపెనీ ఉద్యోగులు, పరీక్షలు జరిపిన వైద్యులు, వైద్య సహాయకులు, బస్సులో టెకీతో ప్రయాణించిన వారితో కలిపి మొత్తం 92 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెకీ తోటి సిబ్బందిలో ఒకరు జ్వరం, దగ్గు లక్షణాలతో మారతహళ్లిలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.