తెలంగాణలో నమోదైన తొలి కరోనా పాజిటివ్ కేసు

తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తెలంగాణకు చెందిన వ్యక్తిలో కరోనా (కోవిడ్-19) లక్షణాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన మరో వ్యక్తిలోనూ కరోనా లక్షణాలు గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం (మార్చి 2) మధ్యాహ్నం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో రెండు కరోనా కేసులు నమోదైనట్లు ప్రకటనలో వెల్లడించారు. ఇరువురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో హై అలర్ట్ విధించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )