చేతులెత్తేసిన యెస్ బ్యాంక్ : దివాలా తీసిన బ్యాంక్ : ఆర్బీఐ ఆంక్షలు  వివరాలలోకి వెళ్తే  ,  బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్ నివాసంలో నిన్న రాత్రి ఈడీ సోదాలు నిర్వహించింది. డీహెచ్ఎఫ్ఎల్‌కు యస్ బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారడం వెనక కపూర్ పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన రుణాల్లోనూ కపూర్ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. తీసుకున్న రుణాలకు ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి కొంత సొమ్ము కపూర్ భార్య ఖాతాల్లోకి చేరినట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసంలో ఈడీ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఎస్‌ బ్యాంకు ప్రస్తుత పరిస్థితి కారణం కూడా కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిధుల కొరత ఎదుర్కొంటున్న ఎస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు