కరోనా వైరస్ వల్ల గూగుల్ కూడా ఇబ్బందులు అదొర్కొంటోంది

కరోనా వైరస్  వల్ల గూగుల్ కూడా ఇబ్బంది ని ఎదుర్కొంటోంది .  ముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ గూగుల్‌ మే 12 నుంచి 14వ తేదీ వరకు జరగాల్సిన వార్షిక డెవలపర్‌ సదస్సు ఐ/ఓ 2020ని రద్దు చేసింది. ఈ మేరకు గూగుల్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్‌ కారణంగానే ఈ సదస్సును రద్దు చేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. డెవలపర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ సారి కష్టతరమవుతుంది, కానీ సదస్సు కన్నా వారి ఆరోగ్యం ముఖ్యమని తాము భావిస్తున్నామని గూగుల్‌ తెలిపింది. అయితే సదస్సు రద్దు నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను గూగుల్‌ అన్వేషిస్తున్నది. ఈ క్రమంలో ఈ విషయంపై త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.