విజయవాడ లో కరోనా కలకలం


ఈ మధ్యే జర్మనీ నుంచి ఢిల్లీ, హైదరాబాద్ మీదుగా విజయవాడకు నిన్న రాత్రి 9.30 గంటలకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ వ్యక్తికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించగా, జ్వరంతో పాటు జలుబు, దగ్గు ఉన్నాయని, ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకున్నాడని తేలింది. వెంటనే విమానాశ్రయం అధికారులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా, ప్రత్యేక అంబెలెన్స్ లో విజయవాడలోని అతని ఇంటికి తీసుకెళ్లి, రక్త నమూనాలను సేకరించారు. ప్రస్తుతం అతన్ని విడిగా ఓ గదిలో ఉంచామని, పరిస్థితిని నేడు సమీక్షించి అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తామని వైద్యాధికారులు తెలిపారు. కాగా, జర్మనీ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి ఢిల్లీలో స్క్రీనింగ్ పరీక్షలు జరిగినా వైరస్ లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం.