వార్డు కౌన్సిలర్‌ గా నామినేషన్ వేసిన జేసీ సోదరుడు


 జేసీ దివాకర్‌రెడ్డి. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా అనేక పదవుల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం చేతిలో ఏ పదవీ లేక ఖాళీగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కుమారుడు పవన్‌రెడ్డి, తమ్ముడు జేసీ ప్రభాకర్‌రెడ్డిని బరిలో దించినా వారు ఓడిపోయారు. పైగా ఆయన ఉన్న టీడీపీ అధికారానికి దూరమైంది. ఇటు జేసీ బ్రదర్స్‌కు కూడా కష్టాలు మొదలయ్యాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. బస్సులు, వాహనాలను సీజ్‌ చేస్తున్నారు అధికారులు. కేసులపై కేసులు నమోదవుతున్నాయి. అధికారంలో ఉన్నా.. లేకున్నా రాజకీయంగా చక్రం తిప్పిన దివాకర్‌రెడ్డి.. బహుశా ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. అయితే అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో 30వ వార్డుకు.. టీడీపీ కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రెడ్డీ సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఆయన తరపున నామినేషన్ దాఖలు చేశారు లాయర్ శ్రీనివాసులు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా జేపీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు తాడిపత్రి నుంచి పోటీ చేశారు. మరోవైపు.. వైసీపీ తరఫున తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొడుకు హర్షవర్థన్ రెడ్డి పోటీ చేశారు