విశాఖలో కరోనా దెబ్బకు వాయిదా పడ్డ నౌక దళ విన్యాసాల కార్యక్రమాలు

ఇండియాలో కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది . తెలంగాణ , ఏపీలోనూ అప్రమత్తం అవుతున్నారు . హైదరాబాద్ లో కరోనా ఖరారైలన వ్యక్తికి చికిత్స జరుగుతోంది . అయితే ఇప్పుడు ఈ కరోనా ప్రభావం విశాఖ పట్నానికీ తాకింది . అయితే ఈ తాకిడి కరోనా వైరస్ సోకడం తో కాదు .. సుమా .. కరోనా ఎఫెక్ట్ తో విశాఖలోని ఓ బ్రహ్మాండమైన కార్యక్రమం వాయిదా పడింది . అసలు విషయం ఏంటంటే .. విశాఖ లో ఈనెల 18 నుంచి అనేక దేశాలతో కూడిన నౌకా దళాల సంయుక్త విన్యాసాలు జరగాల్సి ఉన్నాయి . ఈ విన్యాసాల కోసం విశాఖలోని నౌకా దళం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది . అయితే కరోనా ఎఫెక్టుతో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తీవ్రంగా ప్రభావింతం అవుతోంది . బహుళ దేశాల నౌకా దళాల సంయుక్త విన్యాసాలతో కూడిన మిలన్ 2020 కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారు . ఇప్పటికే ఈ విన్యాసాల కోసం తూర్పు నౌకా దళం భారీగా ఏర్పాట్లు చేసింది . కానీ కరోనా ప్రభావంతో విదేశాల నుంచి రాక పై నిషేధాన్ని కేంద్రం అమలు చేసింది . దీనివల్ల ఈ విన్యాసాలకు 27 దేశాల నుంచి హాజరు కావాల్సిన నౌకా దళాల సిబ్బంది రాకకు ఇబ్బంది ఏర్పడింది .