జనాలు లేక వెలవెలబోయిన భారత్ దక్షిణాఫ్రికా మొదటి వన్డే


 భారత్ దక్షిణాఫ్రికా తో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం అందరికి తెలుసు. అయితే అందులో భాగంగా నిన్న ధర్మశాలలో జరగాల్సిన మొదటి వన్డే కు వరుణుడు అడ్డుపడటం తో టాస్ కూడా పడకుండానే మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్ పై కరోనా ప్రభావం ఉండటంతో స్టేడియం లోకి అభిమానులు ఎక్కువగా రాలేదు. అయితే ఇంకా మిగిలి ఉన్న రెండు వన్డే మ్యాచ్లు బీసీసీఐ ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించనుంది అని సమాచారం. దీనికి సంభంధానచిన ఆదేశాలు బీసీసీఐ కి క్రీడామంత్రిత్వ శాఖ పంపిందని సమాచారం. అందులో ఒకే చోట ఎక్కువ సంఖ్యలో ప్రజలు రాకూడదని బీసీసీఐ కి చెప్పింది. ప్రస్తుతం సౌరాష్ట్ర, బెంగాల్‌ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ఫైనల్‌ లో ఇదే చివరి రోజు అయితే మ్యాచ్ కు ఈ రోజు అభిమానులను స్టేడియం లోపలి అనుమతించడం లేదని బీసీసీఐ తెలిపింది. కేవలం ఆటగాళ్లను సంబంధిత అధికారులను మాత్రమే లోపలి అనుమతిస్తున్నాటు తెలిపింది. అయితే ఈ ఆదేశాల ప్రకారం ఐపీఎల్ కూడా ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మార్చి 15న లఖ్‌నవూ లో రెండో వన్డే జరగనుంది.