ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సినిమాలో కత్రినా కైఫ్


ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. బాలీవుడ్ భామనే ఆయన జోడీ కట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక సినిమాను ప్లాన్ చేశాడు. ఇది పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని చెప్పాడు. ఆ తరువాత .. ఈ సినిమాలో నాయికలుగా దీపికా పదుకొనె .. ప్రియాంక చోప్రా పేర్లు ప్రధానంగా వినిపించాయి. కానీ ఇప్పుడు కత్రినా కైఫ్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. గతంలో తెలుగులో 'మల్లీశ్వరి'.. 'అల్లరి పిడుగు' సినిమాల తరువాత ఆమె ఇక్కడ చేయలేదు. మళ్లీ తెలుగు సినిమాల్లో చేయడానికి ఆమె కూడా ఆసక్తిని కనబరుస్తోందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.