గవర్నర్ ని కలిసిన సీఎం కేసీఆర్ : కరోనా వైరస్ , బడ్జెట్ గురించి వివరించినట్లు సమాచారం

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ తో సమావేశమై వివరించినట్టు సమాచారం. పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమై ఉందని స్పష్టంచేసినట్టు సమాచారం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితాలిచ్చాయని, పారిశుద్ధ్యం మెరుగైందని, దీంతో అంటురోగాలు ప్రబలే అవకాశాలు సన్నగిల్లిపోయాయని గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం.   రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం పొందిన బడ్జెట్‌ ప్రసంగం ప్రతిని సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌తో శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించారు. 6న గవర్నర్‌ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 7న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార, విపక్షాలు సభలో చర్చించనున్నాయి. 8న శాసనసభలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఈ విషయాలను సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )