సెలవు రోజున రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు


తెలంగాణ శాసన సభ సమావేశాలు ఈ రోజు మొదలయ్యాయి . అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీతోపాటు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు. కాగా, మార్చి 8న ఆదివారం రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 12 రోజులపాటు జరిగే ఈ సమావేశాలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మార్చి 9, 10, 15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాజరయ్యారు. మార్చి 20వ తేదీన మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల పొడగింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )