పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ " ఫస్ట్ లుక్ విడుదల

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల ఇవాళ  చేసింది. 'వకీల్ సాబ్‌'గా పవన్ లుక్ అదిరిపోతోంది. ఫుల్ హెయిర్, గడ్డం, బ్లాక్ కళ్లజోడు, చేతిలో పుస్తకంతో ఉన్న పవన్ లుక్ చాలా మాస్‌గా ఉంది. హిందీ చిత్రం 'పింక్‌'కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ప్రీ లుక్ కూడా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్‌కు కూడా విశేష స్పందన వస్తోంది. పవన్ అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు. 'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ఇది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )