బాలీవుడ్ సల్మాన్ ఇంట్లో విషాదం..

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ (38) మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్లా సోమవారం రాత్రి ముంబైలోని లీళావతి ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిశారు. ఈ విషాయాన్ని సల్మాన్‌ ధృవీకరిస్తూ ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము’ అంటూ తన ట్విటర్‌ ఖాతాతో పోస్ట్‌ చేశాడు.


అబ్దుల్లా మృతి పట్ల సల్మాన్‌ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, బాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కాగా వ్యక్తిగతంగా బాడీబిల్డర్‌ అయిన అబ్దుల్లా సల్మాన్‌తో కలిసి అనేక వేదికలపై కనిపించారు. వీరిద్దరూ కలిసి జిమ్‌ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్‌ గతంలో అనేకసార్లు సోషల్‌మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు.