కరోనా దెబ్బకి వాయిదా పడ్డ నాని "వి" సినిమా :కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అల్లకల్లోలాన్నీ సృష్టిస్తుంది .కరోనా వైరస్ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై భారీగాపడింది . ఇప్పటికే పలు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు మూసుకుపోయాయి. దీనితో అనేక సినిమాల రిలీజ్ వాయిదా పడనున్నాయి. ఈ నేపథ్యంలో నాని, సుధీర్ బాబు నటించిన వీ సినిమా వాయిదా వేస్తున్నామని ఆ చిత్ర బృందం ప్రకటించింది. తమ ఆధీనంలోలేని పరిస్థితుల కారణంగా మార్చి 25న రావాల్సిన సినిమాను వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ తాజాగా ప్రకటించింది. ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ లో రాబోతుంది. సమ్మర్ హాలిడేస్ ఎడ్వాంటేజ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని చాలా సినిమాలు ఏప్రిల్, మే నెలలో రావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.