స్థానిక ఎన్నికల పోటీకి రంగం సిద్ధం చేస్తున్న జనసేనాని "పవన్ కళ్యాణ్"

ఆంధ్రప్రదేశ్ లో  స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది మూడు రోజుల పాటూ నామినేషన్లు.. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.. అభ్యర్థుల ఎంపికతో పాటూ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు జనసేన కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది.స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు జిల్లాలవారీగా జనసేన సమన్వయకర్తల నియమించారు. నామినేషన్‌ దశ నుంచి పోలింగ్‌ ప్రక్రియ వరకూ పార్టీ కార్యక్రమాలను వీరు సమన్వయం చేసుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 13 జిల్లాలకు సమన్వయకర్తల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా : డాక్టర్‌ బి.రఘు
విజయనగరం జిల్లా : గడసాల అప్పారావు
విశాఖపట్నం (రూరల్‌) : సుందరపు విజయ్‌ కుమార్‌

కడప : డా.పి.హరిప్రసాద్‌
కర్నూలు : టి.సి.వరుణ్‌
అనంతపురం : చిలకం మధుసూదన్‌ రెడ్డి