టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత హాకీ జట్టు

హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు సరికొత్త చరిత్ర నెలకొలిపింది.  టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా తమ సత్తా చాటుకొన్నాయి. అంతేకాదు.అంతర్జాతీయ హాకీ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం అత్యుత్తమ స్థానాలలోనిలిచాయి. పురుషులజట్టుకు 4వ ర్యాంక్. అంతర్జాతీయ హాకీలో ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత 12, 13 స్థానాలలో నిలుస్తూ వచ్చిన భారత పురుషులజట్టు. అంతర్జాతీయ హాకీలో నిలకడగా రాణిస్తూ,ఇనూహ్య విజయాలు సాధించడం ద్వారా అత్యుత్తమంగా 4వ ర్యాంక్ సంపాదించింది. ప్రపంచ హాకీ లీగ్ రెండంచెల సమరంలో ప్రపంచ నంబర్ వన్ బెల్జియం, ప్రపం చాంపియన్ ఆస్ట్ర్రేలియా, మూడోర్యాంకర్ నెదర్లాండ్స్ లాంటి జట్లపై సంచలన విజయాలు సాధించడం ద్వారా నాలుగోర్యాంక్ సంపాదించగలిగింది. బెల్జియం, టాప్ 10 లో భారత మహిళా జట్టు. రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత మహిళా జట్టు సైతం అత్యుత్తమంగా 9వ ర్యాంక్ సంపాదించగలిగింది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సంపాదించిన భారత మహిళాజట్టు సాధించిన అత్యుత్తమ ర్యాంకు ఇదే కావడం విశేషం. నెదర్లాండ్స్, ఆస్ట్ర్రేలియా, జర్మనీ, అర్జెంటీనా, ఇంగ్లండ్ మొదటి ఐదుర్యాంకుల్లో నిలిచాయి.ఆస్ట్ర్రేలియా, నెదర్లాండ్స్ మొదటి మూడుర్యాంకుల్లో నిలిస్తే..అర్జెంటీనాను ఐదో స్థానానికి నెట్టి భారత్ నాలుగోర్యాంక్ సొంతం చేసుకోగలిగింది. జర్మనీ, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఆరు, ఏడు, ఎనిమిది ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. 2003లో తొలిసారిగా హాకీలో ర్యాంకింగ్స్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత భారత పురుషులజట్టు సాధించిన అత్యుత్తమ ర్యాంకు ఇదే కావడం విశేషం. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )