అందరికి అందుబాటులోకి వచ్చిన వాత్సాప్ డార్క్ మోడ్ .. ఎలా మార్చుకోవాలో తెలుసుకొండిలా ...!

ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌లో అందరు ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్‌ను విడుదల చేసింది.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో డార్క్ మోడ్ ఫీచర్ ఆటోమెటిక్‌గా వచ్చేస్తుంది. అంతకన్నా తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నట్టైతే సెట్టింగ్స్ మార్చాలి. ఇక డార్క్‌మోడ్ ఉపయోగించడం వల్ల కళ్లకు అలసట తగ్గుతుందని చెబుతోంది వాట్సప్. అయితే మరి వాట్సాప్‌లో డార్క్ మోడ్ కోసం సెట్టింగ్స్ ఎలా మార్చాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు ముందుగా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేసి మీ వాట్సప్ అప్‌డేట్ చేయండి. ఇప్పుడు వాట్సాప్‌లో త్రీ డాట్ మెనూ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఛాట్స్ సెలెక్ట్ చేయండి. అందులో `థీమ్‌` ఆప్షన్ కనిపిస్తుంది. అందులో డార్క్‌ సెలెక్ట్ చేస్తే మీ వాట్సప్ డార్క్‌మోడ్‌లోకి మారిపోతుంది. కాగా, వాట్సాప్‌లోని డార్క్ మోడ్ కంటి అలసటను తగ్గించడంతో పాటు కొంతవరకు బ్యాటరీ లైఫ్ ను ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది.