నిజామాబాద్ లో కరోనా కలకలం : దుబాయ్ నుండి ఇండియా కి జిన్న రాజయ్య కి వైరస్ సోకిందని అనుమానం


ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ భారత్‌లో ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. హైదరాబాద్‌లోనూ సోమవారం తొలికేసు నమోదు అయ్యింది . తాజాగా నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జిన్న రాజయ్య (50)కు కరోనా వైరస్  సోకిందనే అనుమానం కలుగుతోంది. వ్యాధి లక్షణాలు కనిపించడంతో తొలుత కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బాధితున్ని తరలించారు. అయితే రాజయ్య వారం క్రితమే దుబాయ్‌ నుంచి వచ్చినట్లు కుటుంబ సభ్యలు చెప్పడంతో అక్కడి వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దుబాయ్‌ నుంచి భారత్‌కు చేరకుని వారం అవుతోందని, అప్పటి నుంచి తీవ్ర జ్వరం, తుమ్ముల, వాంతులు వస్తున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అతనికి వైరస్‌ సోకి ఉండొచ్చన్న అనుమానంతో గాంధీకి తరలించినట్లు వైద్యలు పేర్కొన్నారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )