విలేకరిపై అసహనం వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ : ప్రజలలో మిశ్రమ స్పందన

టీమిండియా కెప్టెన్  రిపోర్టర్ కి దీటుగా సమాధానం ఇచ్చాడు . తనను ప్రశ్నించిన విలేకరిపై మండిపడ్డాడు. దీంతో మీడియా సమావేశం కాస్తా హాట్ హాట్‌గా సాగింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైనప్పుడు కోహ్లీ ప్రవర్తించిన తీరు విమర్శలకు కారణమైంది. అలాగే, టామ్ లాథమ్ అవుటైనప్పుడు ఓ వర్గం ప్రేక్షకులకు వేలు పైకెత్తి చూపిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో వైరల్ అయింది. దీంతో కోహ్లీ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. 
తాజా మీడియా సమావేశంలో ఓ విలేకరి ఇదే విషయాన్ని ప్రశ్నించాడు. 
జర్నలిస్టు: విరాట్, మైదానంలో మీ ప్రవర్తనకు ప్రతిస్పందన ఏమిటి? విలియమ్సన్ అవుటైనప్పుడు అసభ్యపదజాలం ఉపయోగించారు. అలాగే, ప్రేక్షకులను కూడా ఏదో అన్నారు. ఇండియా కెప్టెన్‌గా మీరు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం లేదా? 
కోహ్లీ: మీరేమనుకుంటున్నారు?
 జర్నలిస్టు: ప్రశ్న అడిగింది నేను 
కోహ్లీ: నేను మిమ్మల్ని జవాబు అడుగుతున్నాను 
జర్నలిస్టు: కెప్టెన్‌గా మైదానంలో మీ ప్రవర్తన సరిగా ఉండాలి కదా కోహ్లీ: అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని సరైన ప్రశ్నలతో రావాలి. సగం సగం ప్రశ్నలు, సగం వివరాలతో ఇక్కడికి రాకూడదు. ఒకవేళ మీరు వివాదం సృష్టించాలనుకుంటే అందుకు ఇది సరైన వేదిక కాదు. నేను మ్యాచ్‌ రిఫరీతో మాట్లాడాను. సమస్యేమీ లేదు. థ్యాంక్యూ.. అని కోహ్లీ బదులిచ్చాడు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )