ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు వాడకాపోతే , అవి ఇక పనిచేయవు


కార్డుల సెక్యూరిటీ విషయంలో బ్యాంకులను అలర్ట్ చేస్తోంది. ఈ క్రమంలో.. డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులు కలిగిన కస్టమర్లు.. వాటిని ఇప్పటివరకు వాడకపోయినైట్లెతే అవి పనిచేయవని పేర్కొంది. ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడకంలో లేని కార్డులు పనిచేయవని ఆర్బీఐ తెలిపింది. డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ట్రాన్సాక్షన్స్ సెక్యూరిటీ పెంపులో భాగంగా.. ఈ సంవత్సరం జనవరి 15న ఆర్బీఐ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి 16లోగా వినియోగించని కార్డులను నిరుపయోగంగా చేయాలంటూ బ్యాంకర్లకు, కార్డు ఇష్యూ చేసే వారిని ఆర్బీఐ ఆదేశించింది. కాగా.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (RFID) టెక్నాలజీ ఆధారంగా డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు పనిచేస్తాయి. ప్రతి ఏటా ఈ కార్డులతో ట్రాన్సాక్షన్స్ పెరుగుతుండటంతో.. ఈ సర్వీసుల్లో ఎలాంటి మోసాలు జరగకుండా.. ఎప్పటికప్పుడు ఆర్బీఐ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది.