ఈ రోజు నుండే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ


ఆంధ్రప్రదేశ్లో  స్థానిక సంస్థల ఎన్నికల రంగం సిద్ధం .  ఈ  రోజు నుండే   నామినేషన్ల ప్రక్రియ మొదలు . ఇప్పటికే టికెట్ దక్కించుకున్నవాళ్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. ఈసారి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో 660 ZPTC, 9984 MPTC స్థానాలుండగా.. ఈ నెల 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ జరగనుంది. 24న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 30న జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక.. వైస్ ఛైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. అలాగే ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల్ని ఎన్నిక ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుండటంతో పార్టీలన్నీ బిజీ అయ్యాయి. అభ్యర్థుల్ని ఖరారు చేయడంతో పాటూ ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటూ మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకాబోతోంది.. 13న ముగుస్తుంది. 14న నామినేషన్ల పరిశీలన..16న నామినేషన్లను ఉపసంహరణ ఉంటుంది. 23న పోలింగ్.. 27న కౌంటింగ్ ఉంటుంది. ఈ నెల 31న కార్పొరేషన్లు, కో-ఆప్షన్ సభ్యులు.. మున్సిపాలిటీలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక నిర్వహించనున్నారు. అలాగే పంచాయతీ ఎన్నికలు ఈ నెల 27, 29న రెండు విడతల్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.