తెలంగాణ రాష్ట్రంలో రైతులకు శుభవార్త .. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు


తెలంగాణ రాష్ట్రంలో రైతులకు శుభవార్త .. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు  హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సెల్లెస్టియల్ ఈ మొబిలిటీ బుధవారం సరికొత్త ఈ-ట్రాక్టర్‌ను లాంచ్ చేసింది. దీని ఖరీదు కూడా అందుబాటులో ఉందని కంపెనీ చెబుతోంది. దీని పనితీరు కూడా డీజిల్ పవర్డ్ ట్రాక్టర్ కంటే 4 రెట్లు ఉంటుందట. తాము తీసుకు వచ్చిన ఈ-ట్రాక్టర్ పర్యావరణహితమైనదని సెల్లెస్టియల్ ఈ మొబిలిటీ కో-ఫౌండర్ సిద్ధార్థ వెల్లడించారు. తాజా ఆవిష్కరణతో దేశంలోకి విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్లు వచ్చాయి. ఈ ట్రాక్టర్ 6 HP(21HP డీజిల్ ట్రాక్టర్‌కు సమానం) శక్తిని ఇస్తుందని, సింగిల్ చార్జింగ్‌తో 75 కి.మీ. దూరం ప్రయాణించవచ్చునని, ఈ ట్రాక్టర్‌ గంటకు 20 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని సిద్దార్థ దురైరాజన్ తెలిపారు. ఈ ట్రాక్టర్‌ వినియోగించిన వారికి సరాసరిగా గంటకు రూ.20 నుంచి 35 మేర ఖర్చు కానుందన్నారు.