'లవ్ స్టోరీ'. మూవీ నుండి 'ఏ పిల్లా'.. పరుగున పోదామా?? సాంగ్ విడుదల

శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లవ్ స్టోరీ'. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ఫీల్ గుడ్ మూవీ అనే మార్క్‌ను సొంతం చేసుకుంది.  తాజాగా ఈ మూవీ నుండి 'ఏ పిల్లా' అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్‌ పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'ఏ పిల్లా'.. పరుగున పోదామా?? ఏ వైపో జంటగ ఉందామో'' అంటూ సాగిన ఈ పాటను హరిచరణ్ ఆలపించగా.. చైతన్య పింగళి లిరిక్స్ అందించారు. పవన్ హెచ్. సంగీతం సమకూర్చారు. 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.ప్యూర్ లవ్ స్టోరీస్‌ను తెరకెక్కించడంతో శేఖర్ కమ్ములది ప్రత్యేకమైన శైలి. 'లవ్ స్టోరీ' అనే టైటిల్‌తోనే ఆయన సినిమా వస్తుండటంతో నాగ చైతన్య, సాయి పల్లవిలు జోడీగా నటిస్తున్న 'లవ్ స్టోరీ'పై అంచనాలు ఏర్పడ్డాయి.