చైనా మళ్లి మొదలెట్టింది.. థూ! మీరిక మారరా?.

చావు తప్పి కన్ను లొట్టపోయినా చైనా ప్రజల్లో మాత్రం మార్పు రాలేదు. ఏ ఇష్టానుసార ఆహార శైలితో ఇబ్బందులు పడ్డారో.. మళ్లీ అదే వైపు అడుగులు వేస్తున్నారు. భయంకరమైన కరోనా వైరస్‌ను ప్రపంచ దేశాలకు అంటగట్టి, దాన్నుంచి బయటపడ్డామన్న విజయోత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాల మాంసం కోసం క్యూలు కడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా నెలల లాక్‌డౌన్‌కు తాజాగా స్వప్తి పలికింది. ముందులాగే ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపొచ్చని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. దీంతో చైనా ప్రజలు సంబురాలకు తెరతీశారు. చప్పబడిన నాలుకలకు పని చెబుతున్నారు. శనివారం సౌత్‌ వెస్ట్‌ చైనాలోని గుయ్‌లిన్‌లో కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాలు, పాములు ఇతర రకాల క్రిమి కీటకాలు, జంతువుల మాంసం షాపుల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలు కట్టారు.