ఈరోజుల్లో విద్యార్ధులు స్కూల్ అవగానే మొబైల్‌కి అడిక్ట్ అవుతున్నారు. అందుకే మొబైల్ లో కూడా వారి పాఠాలు కాస్త ఇంట్రెస్టింగ్ చెప్పగలిగితే బాగుంటుందనే ఆలోచనతో అధికారులున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో కొన్ని ప్రైవేటు యాప్‌లు సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నాయి. చాలా స్కూల్స్ లో డిజిటల్ పాఠాలు కూడా కొనసాగుతున్నాయి. మరోపక్క టీసాట్ పాఠాల్ని కూడా విద్యార్ధులకు వినిపిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా టెన్త్ విద్యార్ధులకు యూట్యూబ్ పాఠాలు అందుబాటులో తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. అయితే సాద్యాసాధ్యాలపై పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులకు చిత్రా రామచంద్రన్ ఆదేశించినట్టు తెలుస్తోంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )