IPL 2020 ఆగడం తథ్యం అంటున్న నిపుణులు

IPL 2020 ఆగడం తథ్యం అంటున్న నిపుణులు . దీనికి కారణం కరోనా వైరస్ అధికంగా ప్రభలడమే . ఒక్క రోజులే 29 కి వైరస్  చేరిన పౌరులు . భారత్ లో కూడా  ప్రాణాంతక కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్‌లో కూడా విజృంభిస్తోంది. ఇక కరోనా ప్రభావం ప్రస్తుతం క్రీడారంగంపై పడింది. తాజాగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు శ్రీలంక టూర్‌లో షేక్‌హ్యాండ్స్‌ను నిషేదించారు. అలాగే ఐపీఎల్ 2020 కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పందించారు. కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్‌పై లేదని.. షెడ్యూల్ ప్రకారమే మార్చి 29న మొదలవుతుందని స్పష్టం చేశారు. అటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మార్చి 12 నుంచి జరగబోయే సఫారీల సిరీస్‌లో కూడా ఎలాంటి మార్పులు లేవని.. కానీ కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటిస్తామని గంగూలీ తెలియజేశారు. కాగా, ఇండియాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.