స్థానిక ఎన్నికల్లో YCP గెలుస్తుందని చంద్రబాబుకు భయం : మంత్రి బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్  స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చంద్రబాబుకు భయం పట్టుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారని, దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. బోండా ఉమా, బుద్ధా వెంకన్న 10 కార్లు తీసుకుని వెళ్లాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. గూండాలతో దౌర్జన్యం చేయడానికే మాచర్లకు వెళ్లారని ఆరోపించారు. కావాలనే చంద్రబాబు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజాబలం లేదన్నారు. ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. మాచర్లకు చంద్రబాబు గూండాలను పంపారన్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తిప్పికొడతామన్నారు.