తెలంగాణ భారీగా ప్రబలుతున్న కరోనా : 1000 కి చేరువలో కరోనా భాదితులు


తెలంగాణ: రాష్ట్రంలో   కూడా కరోనా వైరస్ రోజు రోజు కి విలయ తాండవం చేస్తుంది.గడిచిన 24 గంటలలో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 928 కు చేరాయి దీనితో 1000 కి చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి. 23 మంది ఇప్పటి వరకు తెలంగాణాలో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణాలో పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య. 194 గా ఉందని.. ప్రస్తుతం 711 మంది చికిత్స పొందుతున్నారాని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
సూర్యాపేట జిల్లాలో ఈ ఒక్క రోజే 26 కరోనా కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో 19 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తంగా ఇప్పటి వరకు సూర్యాపేటలో 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో మూడు కేసులు, గద్వాల్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. అదిలాబాద్ లో 2 కేసులు, ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కొత్త కేసు నమోదు అయింది. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా ఈ స్థాయిలో పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు.