కరోనా కోరల్లో భారత్ : 1000 కి చేరువలో కరోనా మృతులు


జాతీయం : భారత్‌లో కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్త లక్డౌన్ కొనసాగుతున్న కరోనా వైరస్ విజృంభణ ఆగకుండ ప్రభలుతునే ఉంది. గడిచిన 24 గంటల్లో 57మంది మృతి వాత పడ్డారు . దీంతో మృతుల సంఖ్య 775కి చేరింది. కాగా దేశవ్యాప్తంగా శనివారం ఉదయం వరకూ మొత్తం 24,506 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 18,668 యాక్టివ్‌ కేసులు ఉండగా, 5,063 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 301మంది చనిపోగా,ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. కేంద్ర హోం శాఖ తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బృందాలను(ఐఎంసీటీ) పంపనుంది. 'విపత్తు నిర్వహణ చట్టం-2005' నిబంధనలను అనుసరించి గుజరాత్‌కు రెండు, తెలంగాణకు ఒకటి, తమిళనాడుకు ఒకటి, మహారాష్ట్రకు ఒకటి చొప్పున ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో నిన్న ఒక్కరోజే 3,100మంది మత్యువాత పడ్డారు. యూఎస్‌లో కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 51,071కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 27,90,986కి దాటింది.