మే 17 వరకు లక్డౌన్ ని పొడగిస్తు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం

7

జాతీయం : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాకుడౌన్ కొనసాగుతుంది ,  మే 3 తర్వాత లాక్‌ డౌన్‌ను ముగియనున్న వేల ,  మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌ బుధవారం ప్రకటించారు. ఇందులో కొంత మేర సడలింపులు ఉన్నప్పటికీ, రెడ్‌ జోన్లలో సడలింపులు ఉండబోవన్నారు. మే 17 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ వారిని వెనక్కు తీసుకొస్తామని, అయితే వారు 21 రోజుల లాక్‌ డౌన్‌ లో ఉండాల్సిందేనని చెప్పారు. కరోనాను అదుపులో ఉంచేందుకు మే చివరి వరకూ లాక్‌ డౌన్‌ విధించక తప్పదని, ఈ విషయాన్ని పలువురు నిపుణులు, వైద్యులు చెబుతున్నారని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.