రూ.199 లకు 1000 జీబీ హైస్పీడ్‌ డేటా.. అందించనున్న జియో

జిటెలికాం రంగంలో ఓ సంచలనం. జియో  కస్టమర్లకు తక్కువ ధరకే డాటా ఇచ్చి.. అనతికాలంలోనే ఎక్కువ మంది వినియోగదారులకు తన ఖాతాలో వేసుకుంది. ఇక గతేడాది.. వినియోగదారుల ముందుకు జియో ఫైబర్‌ బ్రాండ్‌బాండ్ కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ.. డేటా వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో రిలయన్స్ జియో ఫైబర్‌(ఫైబర్-టు-హోమ్).. కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్(కాంబో) ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.199 లకు 1000 జీబీ హైస్పీడ్‌ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ వ్యాలిడిటీ కేవలం ఏడు రోజులు మాత్రమే ఉండనుంది. ఈ ప్లాన్‌లో డేటా స్పీడ్ 100 ఎంబీపీఎస్ ఉంటుందని పేర్కొంది.  అయితే ఈ ప్లాన్‌.. ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ వ్యాలిడిటీని అయిపోయిన వారికి, లేదా అదనంగా డేటా కావాలనుకునే వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇందులో లిమిట్ దాటిపోయిన తర్వాత.. డేటా వేగం 1ఎంబీపీఎస్‌కు పడిపోతుందని తెలిపింది. పాత వినియోగదారులతో పాటుగా.. కొత్త వారికి కూడా ఈ ప్లాన్‌ వర్తిస్తుందని తెలిపింది. అయితే.. జీఎస్టీతో కలిపి.. ఈ ప్లాన్‌ ధర.. రూ.234కు చేరుతుంది. డేటాతో పాటుగా.. ఫ్రీ వాయిస్ కాల్స్ కూడా లభిస్తాయి.