లాక్ డౌన్ నేపథ్యంలో 3 నెలల అద్దె వద్దని మానవత్వాన్ని చాటుకున్న ఒక ఇంటి యజమాని

హైదర్‌నగర్‌ : దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్డౌన్ కొనసాగుతున్న వేల , పేదల జీవితాలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులునెలకొన్నాయి . గత నెల రోజులుగా ప్రభుత్వం విధించిన లొక్డౌన్ కారణంతో ఎవరూ పనులు చేయలేక  ఇంటికే పరిమితమయ్యారు. అయితే నెల రోజులుగా పని చేయకపోవడంతో ఇంటి అద్దె, నిత్యావసరాలకు ఇబ్బందులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఇంటి అద్దె విషయంలో ఇళ్ల యజమానులు కిరాయిదార్లను ఇబ్బందులు పెట్టొదని కోరారు. హైదర్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ గౌరవ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డికి తులసినగర్‌లో సొంత ఇల్లు ఉంది. అందులో 10 పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి పరిస్థితి తెలిసిన దామోదర్‌రెడ్డి మూడు నెలల వరకు అద్దె చల్లించాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఆ పది కుటుంబాలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాయి.