కంటైన్మెంట్,రెడ్ జోన్ ప్రాంతాల్లో మే 3 తరువాత కూడా..

కంటైన్‌మెంట్‌, రెడ్‌జోన్ ప్రాంతాల్లో మే 3 తరువాత కూడా ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలిపారు. ఆయన బుధువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని, గ్రీన్‌జోన్ ఏరియాలో పరిశ్రమలు, మిగతా అన్ని పనులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సడలింపులు ఉ‍న్న ప్రాంతాల్లో కూడా సామాజిక దూరం, మాస్కులు తప్పక ధరించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు వస్తున్న కేసులు ఎక్కువగా రెడ్, హాట్‌స్పాట్ ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. చాలా రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు కేంద్రం సూచించిన విధంగా మినహాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు.