నృత్యకళాకారులకు ఆర్థిక సహాయం చేసిన రాఘవ లారెన్స్

సినిమాలు : కరోనా సమయంలో పనిలేకఇబ్బంది పడుతున్న నృత్యకళాకారులకు 5 లక్షల 75 వేల రూపాయిల ఆర్థిక సహాయాన్ని అందించారు నృత్య దర్శకుడు, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌. హైదరాబాద్‌ లో 10 మంది, చెన్నైలో 13 మంది... మొత్తం 23 మంది నృత్య కళాకారులకు తలా ఒక్కొక్కరికీ 25 వేలు చొప్పున వారి అకౌంట్లో వేశారు. ‘‘డ్యాన్స్‌ని నమ్ముకుని జీవితం సాగిస్తున్న నృత్యకళాకారులకు ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో సహాయం చేయడం నా బాధ్యత’’ అన్నారు లారెన్స్‌.