ఏపీలో విజృంభిస్తున్న కరోనా : కొత్తగా మరో 73 పాజిటివ్ కేసులు నమోదు

16

ఆంధ్రప్రదేశ్ : ఏపీలో కరోనా ఉధృతి తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం..7727 శాంపిల్స్ పరీక్షించింది. వాటిలో 73 మందికి పాజిటివ్ అని తేలింది.కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి..దీనితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,332కి చేరింది.రాష్ట్రంలో ప్రస్తుతం 1,014 యాక్టివ్ కరోనా కేసులున్నాయని ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన మూడు రోజులుగా గా ఏపీలో కొత్తగా ఎవరూ చనిపోలేదు. ఇక కొత్తగా కరోనా కేసులు జిల్ల్లాల వారీగా కృష్ణ 13..కర్నూల్ 11..గుంటూరు లో 29..అనంతపురం 04..చిత్తూర్ 03..కడప 04..ప్రకాశం 04..వెస్ట్ గొడవారి 02..ఈస్ట్ గోదావరి..శ్రీకాకుళం..వైజాగ్ ఒక్కొక కేసులు నమోదయ్యాయి..ఈ 1,332 కేసులలో ఇప్పటి వరకూ 31 మంది మరణించగా..287 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు లో 283, కర్నూలులో 343 ,నెల్లూరు 82, కృష్ణ లో 236, చిత్తూర్ 74, కడప 69, ప్రకాశం 60, అనంతపురం 58 వెస్ట్ గోదావరి 56..పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కర్నూల్.. గుంటూరు..కృష్ణ లో ఎక్కువ నమోదు కావడం తో ఏపీ లో భయాందోళను పెరిగిపోతున్నాయి.ఇప్పటి వరకు విజయనగరం ఒక్కటే జిల్లా కరోనా ఫ్రీ జిల్లా గా కొనసాగుతుంది..