నిరుపేద క్రీడాకారులకు కనీస సాయం చేయని భారత ప్రభుత్వం : ఒలంపిప్స్ పధకం తెచ్చిన పట్టించుకోని వైనం


క్రీడలు : మహారాష్ట్రలోని అప్పటి కొల్హాపూర్‌ సంస్థానంలోని గోలేశ్వర్‌ అనే మారుమూల పల్లెకు చెందిన ఖాషాబా మల్లయుద్ధంలో సింహబలుడు. బాల్యంలోనే ప్రత్యర్థుల్ని ‘మట్టి’కరిపించే క్రీడలో తెగ కుస్తీ పట్టేవాడు. ఇలా ఊరు–వాడా గెలిచాక ఓ రోజు జాతీయ చాంపియన్‌నే ఓడించడంతో విశ్వక్రీడలకు అర్హత పొందాడు. 1948లో బెంగాల్‌కు చెందిన జాతీయ ఫ్లయ్‌ వెయిట్‌ చాంపియన్‌ నిరంజన్‌ దాస్‌ను కంగుతినిపించి అదే ఏడాది లండన్‌ ఒలింపిక్స్‌కు సై అన్నాడు. కానీ అణాలతో, నాణేలతో గడిచే ఆ రోజుల్లో రూపాయలు, వేలు వెచ్చించి వెళ్లేదెట్లా? కొల్హాపూర్‌ సంస్థానాధీశుడు దయతలచడంతో జాదవ్‌ లండన్‌ పయనమయ్యాడు. పాల్గొన్న తొలి విశ్వక్రీడల్లో ఆరో స్థానంతో ఖాషాబా టాప్‌–10లో నిలిచాడు. మరో నాలుగేళ్లకు హెల్సింకి (1952) ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా... మళ్లీ కాసుల కష్టాలు ‘హాయ్‌’, హలో అని పల కరించాయి. విరాళాలతో, తెలిసిన వారి చేయూతతో కిట్‌ కొనుక్కునే పైసలే పోగయ్యాయి. మరి పయనానికి డబ్బులెక్కడ్నించి తేవాలి. జాదవ్‌ ప్రతిభా, పాటవం తెలిసినా కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆర్‌. ఖర్దీకర్‌ తన ఇంటిని తాకట్టు పెట్టి రూ. 7000 జాదవ్‌ చేతుల్లో పెడితే అతను... కాంస్య పతకం పట్టుకొచ్చాడు. నిజానికి ఆ మెగా ఈవెంట్‌లో అతనికి స్వర్ణం కాకపోయినా... రజతమైనా దక్కేది. కానీ వెంటవెంటనే బౌట్‌లోకి దిగాల్సి రావడం, ఇదేంటనీ దన్నుగా నిలిచి అడిగే భారత అధికారి ఎవరూ లేకపోవడంతో ఏకబికిన వరుసగా బౌట్లు ఆడేయడంతో అలసిసొలసి కాంస్యానికి పరిమితమయ్యాడు.ఆ కాలంలో కూడా ఇలా నిజమైన కీడాకారులు సొంత డబ్బు ,  విరాళాలతో వెళ్లి మెడల్ గెలుచుకొచ్చాడు . కేంద్ర సాయం  మాత్రం నిల్