మీరెప్పుడైనా ప్రధానమంత్రి కావాలనుకున్నారా...? : బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌


లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్‌లు నిలిచిపోవడంతో బాలీవుడ్‌ స్టార్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది సెలబ్రిటీలు తమకు నచ్చిన పనులతో ఎంజాయ్‌ చేస్తూ లాక్‌డౌన్‌ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటున్న బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఓవైపు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఆక్టివ్‌గా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఇంట్లో ఉన్న బిగ్‌బీ అభిమానులతో ఇంటారాక్ట్‌ అయ్యే ఏ అవకాశాన్ని వదులుకోరు. సోషల్‌ మీడియలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిస్తున్నారు.
ఇటీవల ఓ నెటిజన్‌ అమితాబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘ సార్‌.. మీరు ఎప్పుడైనా ప్రధానమంత్రి కావాలని అనుకున్నారా’ అని బిగ్‌బీని ప్రశ్నించారు. దీనికి అమితాబ్‌ నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘అరే.. పొద్దుపొద్దునే మంచి విషయాలు చెప్పండి.’ అంటూ నెటిజన్‌ ప్రశ్నకు సరదా సమాధానమిచ్చారు. ఇక అమితాబ్‌ ఇచ్చిన సమాధానం నెటిజన్ల చేత నవ్వూలు పూయిస్తోంది.