ఇదొక అర్థంలేని ప్రతిపాదన: వకార్‌ యూనిస్‌

‘ ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా నేను ఇందుకు వ్యతిరేకం. బంతిపై ఉమ్మిని రుద్దడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఇది ఒక అలవాటుగా వస్తోంది. బంతిని ఒకరి దగ్గర్నుంచి ఒకరికి మార్చుకుంటూ బౌలర్‌ చేతికి ఇచ్చే క్రమంలో సలైవాను రుద్దడం ఆనవాయితీగా వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్‌గా అంపైర్ల సమక్షంలో వేరు పద్ధతిలో ట్యాంపరింగ్‌ చేయడం కరెక్ట్‌ కాదు. ఈ చర‍్చ అనేది ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. ఇది కచ్చితంగా తప్పే. లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజలకు ఈ ప్రతిపాదన చిరాకు తెప్పిస్తోంది. ఇది అనాలోచిత నిర్ణయం. సలైవా ప్లేస్‌లో కృత్రిమ పద్ధతిలో కొత్త పద్ధతిని తీసుకురావడం అనేక అనుమానాలకు తెరతీస్తుంది’ అని వకార్‌ పేర్కొన్నాడు.