రేపటి నుండే ఇంగ్లాండ్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో కరోనా వాక్సిన్ టెస్ట్


ఇంగ్లాండ్ : ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మాత్రం కరోనా వాక్సిన్ గురించి గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది.రేపటి నుంచి ఈ వ్యాక్సిన్ కు సంబంధించి మనుషులపై ప్రయోగించనున్నామని ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉండటంతో ఇంత త్వరగా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయగలిగామని అక్కడి వైద్యులు తెలియచేస్తున్నారు. అదే సాధారణ రోజులలో అయితే వ్యాక్సిన్ రూపొందించడానికి చాలా సమయం పట్టేదని చెప్పుకొచ్చారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వైద్యులు 2012లో రూపొందించిన ఒక వ్యాక్సిన్ ను మరింత అభివృద్ధి చేసి దానిని ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వైద్యులు తయారుచేసిన వ్యాక్సిన్ కనుక సక్సెస్ అయితే ప్రపంచం మొత్తం కోలుకున్నట్లే చెప్పుకోవచ్చు. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రంస్ దేశాలలో అయితే వైరస్ మహమ్మారి ఆ దేశాలను కకావికలం చేస్తుంది. ప్రస్తుతం రోజుకు 80 వేల మంది ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బారిన పడుతుంటే. ఇప్పటి వరకు వైరస్ తో 179,009 వేల మంది చనిపోగా 26 లక్షల మందికి వైరస్ సోకింది.