ఇర్ఫాన్ ఖాన్ మృతి న‌న్ను షాక్‌కి గురి చేసింది: మహేశ్‌ బాబు

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతి పట్ల టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక తెలివైన నటుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నానని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. కాగా,ఇర్ఫాన్, మ‌హేష్ క‌లిసి సైనికుడు చిత్రంలో క‌లిసి న‌టించిన విషయం తెలిసిందే.
‘ఇర్ఫాన్ ఖాన్ మృతి న‌న్ను షాక్‌కి గురి చేసింది. మా కాలంలోని అసాధార‌ణ‌మైన న‌టుల‌లో ఆయ‌న ఒక‌రు. ఆయన సినిమాలు, నటన ఎల్లకాలం గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.