కరోనా వైరస్ వల్ల వేల కోట్ల నష్టాన్ని చవి చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ :  కరోనా వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆబ్కారీ శాఖలో రూ.1500 కోట్లు, వాణిజ్యశాఖలో రూ.4500 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్బంగా నారాయణ స్వామి మాట్లాడారు. ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. మద్యం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అయన ఆదేశాలు జారీ చేసారు. అన్ని బార్లు, షాపుల్లో స్టాక్ ను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశించారు. నాటుసారా, ఎన్డీపీఎల్ పై ప్రత్యేక దాడులు నిర్వహించే దిశగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. లాక్ డౌన్ సమయంలో 2791 కేసులు, 2849 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.