కరోనా.. ఏపీకి అరబిందో ఫార్మా భారీ విరాళం

 కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసకుంటున్న చర్యలకు పలు సంస్థలు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి  అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ రూ. 7.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. దీనికి అదనంగా రూ. 3.5 కోట్ల విలువైన శానిటైజర్లు, హై ఎండ్‌ మెడికల్‌ కిట్స్‌, మాస్కులతో పాటు ఇతర వైద్యసామాగ్రిని పంపిణీ చేయనున్నట్టు అరబిందో ఫార్మా తెలిపింది. 

ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కే నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిలు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు నిత్యానందరెడ్డి  విరాళానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు.