తొక్కే కదా అని చిన్న చూపు చూడకండి

అన్ని పండ్ల తొక్కల్లో విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందుకని వాటిని ఆహారంగా తీసుకోలేం కదా. అయితే తొక్కే కదా అని తీసిపారేయకండి. వాటిని మరోలా ఉపయోగించుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలు అందానికి బాగా ఉపయోగపడతాయని ఇంతకు ముందు చాలా సార్లు తెలుసుకున్నాం. బకెట్‌ నీళ్ళలో కొన్ని నిమ్మ తొక్కలు వేసి మరిగించి, ఆ నీళ్లతో స్నానం చేయాలి. నిమ్మతొక్కల్లోని సిట్రిక్‌ యాసిడ్‌ వల్ల చర్మం మృదువుగా అవుతుంది.

  •   యాపిల్‌ తొక్కను కూడా మిక్సీ చేసి ముఖానికి పట్టించాలి.నెమ్మదిగా మర్దన చేస్తే, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది....