కరోనా కి వాక్సిన్ టీసింగ్ మొదలెట్టిన లండన్


అంతర్జాతీయం (లండన్) : కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భారీ  ప్రబలుతోంది . కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ ప్రయత్నిస్తున్న వేల  ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ముందడుగు వేసింది . హ్యూమన్ ట్రైల్స్ మొదలెట్టింది  ,  ప్రపంచవ్యాప్తంగా 28  మందికిపైగా ఈ వైరస్ దాడికి గురైనారు. 2 లక్షలకి చేరువలో మృతులున్నారు  . ఈ మహమ్మారికి ఎటువంటి మందు గానీ, వ్యాక్సిన్ గానీ లేదు. ఇప్పుడిప్పుడే యూకేలోని ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను రెడీ చేసిట్రైల్స్ నిర్వహిస్తున్నారు . ఈ ప్రయోగం గురువారం ఆక్స్‌ఫర్డ్‌లో ప్రారంభమైంది, అధ్యయనం కోసం నియమించిన 800 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లలో మొదటి ఇద్దరికి నే కొత్త వ్యాక్సిన్‌ ను ఇచ్చారు . వీరిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. టీకాలు వేసిన మొదటి రెండు రోజుల్లో కొందరికి గొంతు, తలనొప్పి లేదా జ్వరాలు రావచ్చని వారికి ముందే చెప్పారు. వీటికి మానసికంగా సిద్ధంగా ఉండాలని కూడా వారికి సూచించారు. కాగా 800 మంది వాలంటీర్లతో సగం మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇస్తుండగా.. మిగతా సగమందికి మెనింజైటిస్ (meningitis) నుంచి ప్రొటెక్ట్ చేసే కంట్రోల్ వ్యాక్సిన్ ఇస్తారు. కాగా ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉన్న వైరస్‌కు వ్యతిరేకంగా విరుగుడు వస్తుందనే ఆశలను పెంచుతూ క్లినికల్ ట్రయల్స్‌లో మొదటి దశలోకి ప్రవేశించిన ఆరవ కరోనావైరస్ వ్యాక్సిన్ ఇది. ట్రయల్స్ విజయవంతమైతే, సెప్టెంబరు నాటికి ఒక మిలియన్ మోతాదులను సిద్ధం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మరియు ఆ తరువాత తయారీని పెంచుతారు.