హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాకి ఒకే చెప్పనున్న మహేష్ బాబు ..


మహేశ్ బాబు కథ 'సరిలేరు నీకెవ్వరు' తరువాత వెంటనే ఆయన వంశీ పైడిపల్లి ఓకే చేశాడు. కానీ కథ పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వకపోవడంతో, పరశురామ్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తరువాత ప్రాజెక్టు విషయంలో ఇలా జరగకుండా ఉండటం కోసం, హరీశ్ శంకర్ ను లైన్లో పెట్టాడనేది తాజా సమాచారం.  హరీశ్ శంకర్ వినిపించిన ఒక లైన్ కి మహేశ్ బాబు ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ మాట్లాడుతూ, త్వరలో మహేశ్ బాబుతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇదీలావుంటే త్రివిక్రమ్ తో కూడా మహేష్ బాబు చర్చలు జరుపుతున్నారు. చూడాలి ఏం కాంబినేషన్ సెట్ అవుతుందో.