'బాహుబలి':ని బ్రేక్ చేసిన: సరిలేరు నీకెవ్వరూ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా మహేశ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూ​ళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ‘సరిలేరు’  చిత్రం తాజాగా మరో ఘనతను అందుకుంది. 

ఉగాది కానుకగా ఓ ప్రముఖ ఛానల్‌లో వచ్చిన ఈ చిత్రం అత్యధిక టెలివిజన్ వ్యూవర్‌షిప్ రేటింగ్ (టీవీఆర్)ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘బాహుబలి 2’రికార్డులను సైతం ఈ చిత్రం అధిగమించింది. ఇప్పటివరకు 22.70 టీవీఆర్‌తో బాహుబలి-2 అగ్ర స్థానంలో ఉండగా.. తాజాగా మహేశ్‌ సరిలేరు నీకెవ్వరు చిత్రం 23.4 టీవీఆర్‌ను సాధించి గత రికార్డులన్నింటిని తిరగరాసింది. బాహుబలి తొలి పార్ట్‌కు 21.84 టీవీఆర్‌ వచ్చిన విషయం తెలిసిందే.