వాట్సాప్‌ లో సరికొత్త ఫీచర్‌ వాట్సాప్‌ చాట్ బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్


వాట్సాప్‌ లో సరికొత్త ఫీచర్‌ వాట్సాప్‌ చాట్ బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్ లోకి మారుతుంది. దీనివల్ల కళ్ళకు ఇబ్బంది కలుగకుండా ఉంటుంది. ఇక యూజర్లు సెట్టింగ్స్‌లోని చాట్స్‌, థీమ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి డార్క్‌ అనే ఫీచర్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా వాట్సాప్‌లో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లందరికీ ప్రస్తుతం ఈ ఫీచర్‌ లభిస్తున్నది. ఎంతో కాలంగా వాట్సాప్‌ డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండగా, ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.