సూర్యాపేటలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి


సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా దడ పుట్టిస్తోంది. గురువారం జిల్లావ్యాప్తంగా 16మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాగానే, అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానుతలను గుర్తించి హోం క్వారంటైన్‌ చేయడం, లేదా ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. అంతేగాక పాజిటివ్‌ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి వారి స్వాప్‌ నమూనాలు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపుతున్నారు.ఈ నెల 2వ తేదీన ఒకరికి పాజిటివ్‌ రాగా, నాటి నుంచి వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. శనివారం ఒక్కరోజే సూర్యాపేటలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇవాళ మొత్తం 15 కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించారు. జిల్లాలో ఈ రోజు నమోదైన కేసులతో కలిసి 54కు కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. సూర్యాపేట కూరగాయల మార్కెట్‌ ఏరియాలో ఏడు పాజిటివ్ కేసులు, బీబీగూడెంలో రెండు, కోదాడలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.