కరోనా వైరస్ దాటికి ఆగిపోయిన మహిళా క్రికెట్ టోర్నమెంట్


లండన్‌: కరోనా వైరుస్ కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా ఎమర్జెన్సీ నెలకొన్న వేల చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉన్నాయి . లాక్ డౌన్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా ఈవెంట్స్ వాయిదా పడ్డాయి . ఇందులో  భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటన కూడా చేరింది . షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 25 నుంచి ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో నాలుగు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ల్లో భారత్‌ ఆడాల్సి ఉండేది . కరోనా వైరస్‌ నేపథ్యంలో తమ దేశంలో అన్ని స్థాయిల్లోని ప్రొఫెషనల్‌ క్రికెట్‌ను జూలై 1 వరకు వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) శుక్రవారం ప్రకటించింది. దీంతో అక్కడ భారత పర్యటన వాయిదా పడింది. దేశవాళీ క్రికెట్‌ సీజన్‌లోనూ తొమ్మిది రౌండ్ల మ్యాచ్‌ల్ని కోల్పోతున్నట్లు ఈసీబీ తెలిపింది. 'ఈ వేసవిలో కొంత వరకైనా క్రికెట్‌ కార్యకలాపాల్ని నిర్వహించగలమని మేం నమ్ముతున్నాం. వాయిదా పడిన అంతర్జాతీయ టోర్నీలను రీ షెడ్యూల్‌ చేసి మళ్లీ నిర్వహిస్తాం. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆటగాళ్లు, సిబ్బంది ఆరోగ్యమే మాకు ముఖ్యం అని అందరు అంటున్నారు . ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిస్థితులు సద్దుమణిగాకే ప్రొఫెషనల్‌ క్రికెట్‌ను నిర్వహిస్తాం' అని ఈసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టామ్‌ హారిసన్‌ పేర్కొన్నారు.