మూడు పులులు, మూడు సింహాలకి కరోనా


న్యూయార్క్::  బ్రాంక్స్ జూలోని మూడు పులులు, మూడు సింహాలు దగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే వాటికి COVID-19టెస్టులు చేశాం. ఫెకల్ శాంపుల్ తో టెస్టులు నిర్వహిస్తున్నాం. జంతువులను అనిస్తీషియాతోనే కదలకుండా ఉంచుతున్నాం. ఈ ఫెకల్ టెస్టుల్లో మరో 6పిల్లులకు కూడా వైరస్ సోకినట్లు కూడా నిర్ధారించాం. కాకపోతే టైగర్ మౌంటైన్ జూలో మరో ఏ ఒక్క పులి దగ్గే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
వైరస్ లక్షణాలున్న ఎనిమిది పిల్లులు జూలో చక్కగా ఆడుకుంటున్నాయి. మామూలుగానే ప్రవర్తిస్తున్నాయి. బాగానే తింటున్నాయి. వాటి దగ్గు కూడా దాదాపు తగ్గిపోయింది. నొవల్ కరోనా వైరస్ ఇతర జంతువులకు సోకకుండా ముందుజాగ్రత్త కోసం పులులు, సింహాలకు పరీక్షలు చేశాం. పిల్లలకు వెటర్నరీ ల్యాబరేటరీల్లో టెస్టులు చేస్తున్నాం. ఇప్పటికీ ఆ జంతువులకు వైరస్ ఎవరో సిబ్బంది ద్వారానే వ్యాప్తి చెందిందని అనుకుంటున్నాం. జూలో ఉన్న మిగతా చిరుతపులులు ఇతర జంతువులు ఎటువంటి జబ్బుకు గురికాలేదు.